జపాన్ నుంచి ఇండియాకు సేఫ్ గా చేరుకున్నా.. ఎన్టీఆర్ కీలక ప్రకటన

తన భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయ్, భార్గవ్‌లతో కలిసి హాలిడే ట్రిప్ కోసం జపాన్‌లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే దేశం నుండి సొంత దేశానికి బయల్దేరాల్సి వచ్చింది. తన కుటుంబంతో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి జపాన్‌ వెళ్లిన ఆయన.. తాను సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. అంతకుముందు జపాన్‌లో దాదాపు 155 భూకంపాలు సంభవించడంతో చాలా మంది మరణించారు.  

జపాన్ లో వరుస భూకంపాలు కుదిపేయడం.. ఇదే సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో అక్కడే ఉండడంతో.. ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడ్డారు. దీంతో తాజాగా తారక్.. ఓ పోస్ట్ చేశారు. తాను ఇండియాకి సేఫ్‌గా చేరుకున్నానని.. జపాన్‌కి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని.. వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుత ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా.. ఏప్రిల్ 5న 2023న విడుదలకు రెడీ అవుతోంది.