
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ (ఏప్రిల్ 8న) అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై సినీ రాజకీయ ప్రముఖులు ఒకొక్కరుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా (ఏప్రిల్ 9న) జూనియర్ ఎన్టీఆర్ X వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
"సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారని విని బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లిటిల్ వారియర్, ధైర్యంగా ఉండు! పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు బలం ఇవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని" ఎన్టీఆర్ కోరారు.
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025
ప్రస్తుతం పవన్ కుమారుడు మార్క్ శంకర్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు..మార్క్ శంకర్‌ను చూసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. చేతులు, కాళ్లకు గాయాలవటంతో ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో శంకర్‌కు ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారని చెప్పారు. ప్రస్తుతం మార్క్ శంకర్ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్లు తెలిపాడు. ఇంకో 3 రోజులు వైద్యలు టెస్టులు జరపనున్నట్లు హెల్త్ అప్డేట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.