Jr NTR: హీరో సైఫ్ అలీఖాన్‌కు క‌త్తి పోట్లు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

Jr NTR: హీరో సైఫ్ అలీఖాన్‌కు క‌త్తి పోట్లు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) క‌త్తిపోట్ల‌తో హాస్పిట‌ల్ పాల‌య్యాడు. ముంబైలోని అతని ఇంట్లోకి చొరబడ్డ ఓ ఆగంతకుడు ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటన విన్న టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) X ద్వారా స్పందించారు.

" సైఫ్ సర్ పై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యాను. ఈ సంఘటన నన్నెంతో బాధపెట్టింది. ఆయన త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 2024 ఏడాదిలో వీరిద్దరూ దేవర సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే హీరో సైఫ్ అలీఖాన్ టాలీవుడ్‌లోకి విలన్గా ఎంట్రీ ఇచ్చాడు. భైర పాత్ర‌లో సైఫ్ త‌న విల‌నిజంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. 

సైఫ్ అలీఖాన్ పై జరిగిన ఈ ఘటన ఇవాళ గురువారం జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సైఫ్ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని ఆసుపత్రి వర్గాల సమాచారం.

ఇకపోతే ప్రస్తుతం న్యూరో, కాస్మోటిక్ స‌ర్జ‌న్స్ ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోన్నట్లు తెలిసింది.సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరు చోట్ల గాయాలు.. రెండు క‌త్తిపోట్లు లోతుగా దిగాయ‌ని వైద్యులు తెలిపారు. ఓ గాయం వెన్నుముక‌కు స‌మీపంలో అయ్యింద‌ని, సైఫ్‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. సైఫ్‌కు సర్జరీ చేసిన తర్వాతే మరింత సమాచారం అందించగలుగుతాం అని లీలావతి హాస్పిటల్ సీఈవో నీరజ్ వివరించారు.