బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినీ నటుడు నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి చేసిన ఆరోపణలపై సినీ ప్రముఖులు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా, ఈ ఆరోపణలపై జూ. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎన్టీఆర్.. మంత్రి కొండా సురేఖపై మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమని వార్నింగ్ ఇచ్చారు.
ALSO READ : కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాని ‘అసహ్యం వేస్తోంది’
"కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో.. ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారాహిత్యంగా సినీ పరిశ్రమపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. మనం దీని కంటే పైకి ఎదగాలి. ఇతరుల పట్ల గౌరవాన్ని కొనసాగించాలి. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు.." అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024