నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. విషెష్ చెప్పిన తారక్..

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. విషెష్ చెప్పిన తారక్..

ప్రముఖ స్వర్గీయ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ తదితరులు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న సినిమాతో త్వరలోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించారు. 

అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్ కి హీరోగా పరిచయం కావడానికి సిద్దమవుతున్నాడు. స్వర్గీయ సినీ నిర్మాత నందమూరి జానకిరామ్ తనయుడు నందమూరి నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ వైవీయస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజు (అక్టోబర్ 30)  నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ పేరుతో యూట్యూబ్ లో ప్రోమో వీడియో ఈ షేర్ చేశారు. 

Also Read :- నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న నయనతార డాక్యుమెంటరీ ఫిల్మ్

అయితే ఈ వీడియోలో తారక రామారావు ఊహ తెలిసినప్పటినుంచి నటనపట్ల ఇష్టం పెంచుకున్నానని తెలిపాడు. డైరెక్టర్ వైవీయస్ చౌదరి దగ్గర గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ తీసుకుని ఆయన డైరెక్షన్ లోనే హీరోగా లాంచ్ అవ్వబోతున్నట్లు వెల్లడించాడు. ఇక చివరగా ప్రేక్షకులను రంజింపజేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని  తన ముత్తాత, దైవం నందమూరి తారక రామారావుసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపాడు. ఈ ప్రోమోలో రెబల్ లుక్స్ లో తారక రామారావు అదరగొట్టాడు.


దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్  ఎక్స్  వేదికగా నందమూరి తారక రామారావు కి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపాడు. అలాగే ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీ కి స్వాగతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.