
మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్ (NTR) శైలి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకం. భిన్న దేశాల సంస్కృతుల వారధిగా ఎక్కడికెళితే, అక్కడి భాషలో మాట్లాడి వార్తల్లో నిలుస్తాడు. తాను జపాన్ లో మాట్లాడిన, తెలుగు స్టేజీలపై స్పీచ్లిచ్చిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాడు. కాదు కాదు ట్రెండ్ సెట్ చేస్తాడు. అయితే, ఈ సారి సినిమాల ప్రమోషన్ల కాకుండా, తన లగ్జరీ ఫ్యాషన్ వల్ల వార్తల్లోకి వచ్చాడు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కి వెళ్లాడు. అక్కడ ఎన్టీఆర్ తన అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ, ఊహించని విధంగా ఆ ఫోటోలు అభిమానుల దృష్టిని వీపరీతంగా ఆకర్షించాయి.
అయితే, ఇక్కడ ఆకర్షించింది.. వెకేషన్ స్పాట్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ ధరించిన చొక్కా. చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తోన్న ఈ షర్ట్లో అంతలా ఏముందని అనుకునేరు?? ఆన్లైన్లో దీన్ని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మరింతకు ఆ షర్ట్ ప్రత్యేకత ఏంటో చూద్దాం.
. @tarak9999 in ETRO Shirt.
— NTR Wardrobe Decode (@NTRWardrobe) April 15, 2025
Cost - 85,000 INR#NTRWardrobeDecode#ManOfMassesNTR pic.twitter.com/hWZsucJpCA
పువ్వుల డిజైన్‌తో కూడిన నీలిరంగు చొక్కాను ఎన్టీఆర్ ధరించాడు. నల్ల ప్యాంట్‌పై ఆ షర్ట్ అట్ట్రాక్టీవ్గా కనిపిస్తోంది. ఈ చొక్కా డిజైన్ ప్రత్యేకంగా ఉండటంతో పాటు ఎన్టీఆర్ కొత్తగా ట్రై చేయడం ఆకట్టుకుంటోంది. దాంతో నెటిజన్లు ఆన్లైన్లో ఈ చొక్కా ధర ఎంతుంటుందో అని సెర్చ్ చేయగా షాక్ అవుతున్నారు.
ఈ లగ్జరీ చొక్కా ధర ఏకంగా రూ.85000 చూపించడంతో ఇపుడు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. 'ఎట్రో' అనే ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ తెలుపుతూ ఫ్యాన్స్ చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
►ALSO READ | Vincy Aloshious: ఆ హీరో డ్రగ్స్ తీసుకొని ఇబ్బంది పెట్టాడు.. నటి విన్సీ సోనీ వీడియో రిలీజ్
'ఒక్కో సినిమా కోసం వంద కోట్ల లోపు రెమ్యునరేషన్ తీసుకునే ఎన్టీఆర్ కి, లక్షల విలువ చేసే షర్ట్ ధరించడం సులువే కాదా. దేశ విదేశాల్లో అపారమైన అభిమానులను సంపాదించుకున్న నటుడు, ఇంత విలువ చేసే చొక్కా ధరించడం పెద్ద విషయం కాదు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రింటెడ్ షర్ట్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ వెకేషన్ కోసం రెడీ చేయించినట్లు తెలుస్తోంది.
#JrNTR at his casual best in his latest Dubai trip
— Sashidhar Adivi (@sashidharadivi) April 16, 2025
Guess his shirt price! #ManOfMassesNTR pic.twitter.com/04bTzoYrAs
ఇకపోతే, ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ముందుగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో పాటుగా బాలీవుడ్ మూవీ 'వార్ 2' హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు దేవర 2 ను లైన్ లో పెట్టాడు.