మన దేశంలో మాములుగా సినీ సెలెబ్రెటీలు బాహ్య ప్రపంచానికొస్తే సెల్ఫీలు, వీడియోలు అంటూ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా తమ అభిమాన నటుడు/నటిని చూడటానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా కోకొల్లలు. కానీ ఇతర దేశాల్లో మాత్రం సినీ సెలెబ్రెటీలని సాధారణ మనుషుల్లానే చూస్తారు. అందుకే ఫ్యాన్ వార్స్, తొక్కిసలాటలు, గొడవలు ఇవేం ఉండవు.
అయితే టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్స్ గ్యాప్ లో ఫ్యామిలీతో కలసి ట్రిప్స్ కి వెళుతుంటాడు. ఈ క్రమంలో ఈసారి తారక్ స్కాట్ ల్యాండ్ దేశానికి వెళ్ళాడు. అయితే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ట్రావెల్ వ్లాగర్ ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్ అందాలను చూపించే వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు. దీంతో కొందరు భారతీయ అభిమానులు గుర్తుపట్టి కామెంట్లు చేశారు.
దీంతో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ తారక్ గురించి మరో పోస్ట్ షేర్ చేశాడు. ఈ వీడియో కి ‘ఆగండి… నేను ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో ఒక భారతీయ సెలబ్రిటీని గుర్తించాను' అంటూ వీడియో థంబ్నైల్ పెట్టాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ గొప్ప నటుడని అలాగే RRR, అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో అలరించాడని ప్రసంశించాడు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే కొందరు నెటిజన్లు స్పందిస్తూ సినీ సెలెబ్రెటీలకి కూడా బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగాలని ఉంటుందని కానీ ఇక్కడ హీరో లేదా హీరోయిన్లు బయటికొస్తే ఇబ్బందులు తప్పవని, అందుకే ఎంజాయ్ చేయడానికి ఇలా బయటి దేశాలకి వెళ్తుంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :- మహేష్ని ఓ రేంజ్లో సానబెడుతున్న డైరెక్టర్ జక్కన్న
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్ ఫ్యామిలీతో కలసి టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ విదేశీ ట్రిప్ పూర్తిచేసుకుని వచ్చి హిందీలో నటిస్తున్న వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ సినిమా ఆగస్టు లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.