Jr NTR: జపాన్లో భార్య ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. హృదయాలను కదిలిస్తున్న తారక్ పోస్ట్

Jr NTR: జపాన్లో భార్య ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. హృదయాలను కదిలిస్తున్న తారక్ పోస్ట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR)ప్రస్తుతం జపాన్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న జపనీస్‌లో ‘దేవర’ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు.

సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి (Lakshmi Pranathi) పుట్టినరోజు వేడుకల్ని, మంగళవారం రాత్రి (మార్చి 25న) సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఇంస్టాగ్రామ్ నుండి ప్రణతి బర్త్ డే ఫొటోస్ షేర్ చేసుకున్నాడు. 'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అని తారక్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫొటోస్ కు లైక్స్ కొడుతూ.. వదినమ్మకు స్పెషల్ విషెష్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఎన్టీఆర్ పంచుకున్న రెండు ఫొటోస్ అభిమానులని ఆకర్షిస్తున్నాయి. ఒక ఫొటోలో హృదయపూర్వకంగా కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ నవ్వుతూ కనిపించాడు. రెండవదానిలో కలిసి ఫోటోకి పోజులిచ్చేటప్పుడు చాలా అందంగా కనిపించారు. 

ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి 2011 లో హైదరాబాద్‌లో సాంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. వీరికి అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జపాన్ పర్యటన తర్వాత ఎన్టీఆర్ తన కొత్త మూవీ సెట్స్ లో జాయిన్ కానున్నాడు. అందులో  ఎన్టీఆర్-నీల్, దేవరా పార్ట్ 2, మరియు వార్ 2 లో నటిస్తున్నాడు.