అదిదా జపాన్‌: ఓ వైపు తారక్ స్టైలిష్ ఫోటోషూట్.. మరోవైపు దుమ్ము రేపుతున్న దేవర వసూళ్లు

అదిదా జపాన్‌: ఓ వైపు తారక్ స్టైలిష్ ఫోటోషూట్.. మరోవైపు దుమ్ము రేపుతున్న దేవర వసూళ్లు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ 'దేవర' మార్చి 28,2025న జపాన్‌లో విడుదలైంది. దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను విస్తృతంగా ప్రమోట్ చేశాడు.

ఈ సందర్భంగా జపాన్‌లో అద్భుతమైన ఫోటోషూట్‌ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్న తారక్.. తన కొత్త ఫోటోషూట్‌తో, జపనీస్ భాషతో కిక్ ఇచ్చేస్తున్నాడు.

స్టైలిష్ లుక్లో, బ్లాక్ అండ్ వైట్ అవుట్ఫిట్లో గ్లాసెస్ ధరించాడు. ఎన్టీఆర్ టోక్యోలోని ఓ ప్రముఖ హోటల్లో ఈ ఫోటో షూట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇవి ఎన్టీఆర్ అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి.

దేవర జపాన్ వసూళ్లు:

ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఈ సినిమా జపాన్లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతోంది. తొలి మూడు రోజుల్లోనే దాదాపు 15 మిలియన్ యెన్స్ కు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్లో మరిన్ని కలెక్షన్లు రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : కాంతార నుంచి బిగ్ అప్డేట్... 

ఇప్పటివరకు బాహుబలి 2, టైగర్ 3 వంటి బిగ్గెస్ట్ సినిమాలను అధిగమించింది. అంతేకాకుండా జపాన్ లో అత్యధికంగా ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఇండియన్ సినిమాగా దేవర నిలిచింది. అయితే, దేవర మూవీ ఇంతటి ప్రేక్షకాదరణ పొందడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్.

దేవర విజయానికి కారణం:

స్థానిక మీడియా ఇంటర్వ్యూలు, అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్లు, డ్యాన్స్ బీట్స్ చేసి ఎన్టీఆర్ తన దేవరపై మరింత ఆసక్తిని పెంచారు. దానికితోడు సరికొత్త లుక్ లో ఫోటోషూట్‌లు, జపనీస్ భాషలో ముద్దుగా మాట్లాడటం, అభిమానులకి సెల్ఫీలు ఇవ్వడం ఇలా ప్రతీదీ.. దేవర విజయానికి దోహదపడ్డాయి. ఇకపోతే.. ఈ మూవీ రూ.500 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.