
–ఎన్టీఆర్.. నీల్ (NTRNeel) మూవీ రేపటి నుండి (ఏప్రిల్ 22) షూటింగ్ మొదలవ్వనుంది. మంగళవారం నుంచి ఎన్టీఆర్ సెట్స్‌లో జాయిన్ కానున్నారు. ఇటీవలే ఈ విషయంపై నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ వెల్లడించారు.
నేడు (ఏప్రిల్ 21న) మూవీ మేకర్స్ ఎన్టీఆర్-నీల్ కలిసున్న ఫోటో పంచుకుంటూ ట్వీట్ చేశారు. "రేపటి నుండి అన్నింటినీ నాశనం చేయడానికి రెండు మాస్ ఇంజన్లు సిద్ధంగా ఉన్నాయి. భారతీయ సినిమా తీరాలను కదిలిస్తుందంటూ" క్యాప్షన్ ఇచ్చారు.
ఇందులో ఎన్టీఆర్-నీల్ ఒక సముద్రపు ఒడ్డున నిలుచున్నారు. రేపు జరగబోయే షూటింగ్ కర్ణాటక మంగళూరులోని సముద్రపు ఒడ్డున జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ చేసిన ఫొటో అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాను భారీ స్థాయిలో, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో నీల్ తెరకెక్కిస్తున్నారు.
Two MASS ENGINES ready to wreck it all from tomorrow 💥💥#NTRNeel will shake the shorelines of Indian cinema 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries @tseriessouth pic.twitter.com/psHgfYWuF1
ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2025 జనవరి మూడో వారంలో మంగళూర్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయ్యింది. కానీ, ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. మిగతా నటులతో నీల్ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు. ఇక ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ఆగమనంతో.. షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా ముందుకెళ్లనుంది.
Also Read : కళ్యాణ్ రామ్ మూవీ వీకెండ్ కలెక్షన్లు
ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ NTR 31 మూవీని నిర్మిస్తోంది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రవి బస్రూర్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్. అయితే, మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
And finally welcome to #NTRNeel soil 💣💥@tarak9999 @NTRNeelFilm pic.twitter.com/E9xuPGUfnp
— Prashanth Neel - The Director (@NeelOfficialFc) February 20, 2025