
ఎన్టీఆర్.. నీల్ (NTRNeel) కాంబోపై ఇండియన్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ పూజా ఈవెంట్ జరిగిన దగ్గర నుండి.. ఏదైనా చిన్న అప్డేట్ వచ్చిన చాలనేలా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
నేడు బుధవారం (ఏప్రిల్ 9న) 'ఎన్టీఆర్.. నీల్' మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ సెట్స్‌లో జాయిన్ అవుతారనే విషయాన్ని అధికారికంగా మైత్రి మేకర్స్ వెల్లడించారు.
"మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ అత్యంత విస్ఫోటన దశలోకి ప్రవేశిస్తోంది. ఏప్రిల్ 22 నుండి విధ్వంసకర నేలపైకి ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడు" అని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ క్రేజీ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచింది.
#NTRNeel is entering its most explosive phase 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2025
Man of Masses @Tarak9999 steps into the destructive soil from April 22nd ❤️🔥❤️🔥#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm pic.twitter.com/z7hsCkhOY0
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2025 జనవరి మూడో వారంలో మంగళూర్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయ్యింది. కానీ, ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. మిగతా నటులతో నీల్ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు. ఇక ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ఆగమనంతో.. షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లేకుండా ముందుకెళ్లనుంది.
And finally welcome to #NTRNeel soil 💣💥@tarak9999 @NTRNeelFilm pic.twitter.com/E9xuPGUfnp
— Prashanth Neel - The Director (@NeelOfficialFc) February 20, 2025
ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ NTR 31 మూవీని నిర్మిస్తోంది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హిందీలో ‘వార్ 2’ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న రిలీజ్ కానుంది.