పుష్ప మూవీలో నటనకు ఉత్తమ జాతీయ అవార్డు దక్కించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన్ను కీర్తిస్తున్నాయి. ఇందులో స్పెషల్ గా ఓ మెసేజ్ మాత్రం వైరల్ అవుతుంది.. అదే జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన గ్రీటింగ్స్..
కంగ్రాట్స్ అల్లు అర్జున్ బావ.. పుష్ప మూవీకి వస్తున్న అన్ని విజయాలు, అవార్డులకు నువ్వు పూర్తి అర్హుడివి అంటూ ఎన్టీఆర్ ట్విట్ చేశారు. బన్నీని బావా అంటూ సంబోధించటం కొత్తేమీ కాదు.. గతంలోనూ పార్టీ లేదా బావా అంటూ ట్విట్ చేశారు ఎన్టీఆర్.
తెలుగు నటుడుకి తొలిసారిగా జాతీయ అవార్డు రావటం.. 69 ఏళ్లలో ఇదే ఫస్ట్. దీంతో ఇండస్ట్రీ మొత్తం హ్యాపీ మూడ్ లో ఉంది. పుష్ప మూవీతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమాకు సైతం అవార్డులు వరించాయి. అదే విధంగా ఉప్పెనకు మూవీకి సైతం అవార్డు వరించింది.
Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa.
— Jr NTR (@tarak9999) August 24, 2023