జూనియర్ పంచాయతీ కార్యదర్శులు: 12 నుంచి పోస్టింగ్స్

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు: 12 నుంచి పోస్టింగ్స్

తెలంగాణలో వివిధ కారణాలతో ఆగిపోయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గ్రీన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఒకే చెప్పింది. దీంతో వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించింది పంచాయతీ రాజ్ శాఖ. వివిధ కారణాలతో నియామకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నియామకాలకు ఓకే చెప్పడంతో.. రేపు(గురువారం) లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఆర్డర్స్ ఇవ్వనున్నారు ఆయా జిల్లాల కలెక్టర్లు.

ఎన్నిక సంఘం నిర్ణయంపై  జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.