‘వేటకు సిద్ధం.. ఇకపై అల్లకల్లోలమే’.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఏంటంటే..

‘వేటకు సిద్ధం.. ఇకపై అల్లకల్లోలమే’.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఏంటంటే..

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పడే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి.  ప్రేక్షకుల్లో ఉన్న  హై ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌కు ఏమాత్రం తీసిపోకుండా కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు నీల్. రీసెంట్‌‌గా భారీ  యాక్షన్ ఎపిసోడ్‌‌తో షూటింగ్‌‌ ప్రారంభమవగా, ఈనెల 22 నుంచి ఎన్టీఆర్ సెట్‌‌లో జాయిన్ కానున్నాడని ఇటీవల ప్రకటించారు మేకర్స్. తాజాగా ఆదివారం ఎన్టీఆర్ లేటెస్ట్ స్టిల్స్‌‌ను షేర్  చేసిన టీమ్.. ‘వేట ప్రారంభం.. రేపటి నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌‌లో పాల్గొనబోతున్నారు. ఇకపై అల్లకల్లోలమే’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ మాస్ లుక్‌‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు.

తన కెరీర్‌‌‌‌లో 31వ చిత్రంగా తెరకెక్కుతోన్న  ఈ చిత్రానికి  ‘డ్రాగన్‌‌’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌గా, టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది.