SA20: సన్ రైజర్స్‌తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?

SA20: సన్ రైజర్స్‌తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఆదివారం (ఫిబ్రవరి 2) తో గ్రూప్ మ్యాచ్ లు ముగిశాయి. ఆరు జట్లు తలపడిన ఈ టోర్నీలో నాలుగు జట్లు నాకౌట్ కు అర్హత సాధించాయి. ఇందులో భాగంగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆడనున్న ఎలిమినేటర్ మ్యాచ్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ రెండు ఐపీఎల్ జట్లకు క్రేజ్ ఉండడంతో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. 10 మ్యాచ్ ల్లో 5 విజయాలతో సన్ రైజర్స్ మూడో స్థానంలో.. 10 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచాయి. ముంబై కేప్ టౌన్ (ముంబై), పార్ల్ రాయల్స్ (రాజస్థాన్) క్వాలిఫయర్ 1 లో మంగళవారం (ఫిబ్రవరి 4) తలపడతాయి.  

 
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?

భారత కాలమాన ప్రకారం మ్యాచ్ బుధవారం (ఫిబ్రవరి 5) రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. జియో టీవీ, వెబ్ సైట్ లో ఈ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. టీవీలో స్పోర్ట్స్ 18 ఛానెల్ లో లైవ్ చూడొచ్చు. 
 
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్:

జాక్ క్రాలే, డేవిడ్ బెడింగ్‌హామ్, టామ్ అబెల్, జోర్డాన్ హెర్మన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, లియామ్ డాసన్, సైమన్ హార్మర్, రిచర్డ్ గ్లీసన్, ఒట్నీల్ బార్ట్‌మన్.

జోబర్గ్ సూపర్ కింగ్స్:

డెవాన్ కాన్వే, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), లియుస్ డు ప్లూయ్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సిబోనెలో మఖాన్యా, డోనోవన్ ఫెరీరా, హార్డుస్ విల్జోయెన్, లూథో సిపమ్లా, తబ్రైజ్ షమ్సీ, ఇమ్రాన్ తాహిర్.

ALSO READ | Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్