
హైదరాబాద్, వెలుగు: పర్యావరణానికి మేలు చేసే సీఎన్జీ కార్ల సరఫరా కోసం జేఎస్పీ హ్యుండై, సూర్య ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సీఎన్జీ ఆధారిత హ్యుండై ఆరా కార్లను జూబ్లీహిల్స్‌లోని జేఎస్పీ హ్యుండైలో మంగళవారం సూర్య ట్రావెల్స్‌కు అందజేశారు. కార్బన్ వాయువులను తగ్గించడం, కార్పొరేట్సెక్టార్ పర్యావరణ అనుకూల వెహికల్స్‌ను ప్రోత్సహించేలా చేయడం తమ లక్ష్యమని రెండు సంస్థలు ప్రకటించాయి.
కార్యక్రమంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ కృపాశంకర్ మిశ్రా, యంగ్‌హూన్ యూన్, రామ్ కుమార్‌లు, జేఎస్పీ హ్యుండై మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరెడ్డి, సూర్య ట్రావెల్స్ ఎండి శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ కార్పొరేట్ రంగం పర్యావరణ అనుకూల రవాణా పట్ల ఆసక్తి చూపడం ఆనందకరమని, సీఎన్జీ వాహనాలు కాలుష్యం తగ్గించడంలో, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు.