న్యూఢిల్లీ: సజ్జన్ జిందాల్ ప్రమోట్ చేస్తున్న జేఎస్డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ ద్వారా రూ. 4,000 కోట్లు సేకరించడానికి సెబీ అనుమతిని పొందింది. గత సంవత్సరం ఆగస్టులో దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం, ఇందులో రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ, రూ. 2,000 కోట్ల విలువైన ఆఫర్- ఫర్ -సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటాయి.
ఓఎఫ్ఎస్ద్వారా ఏపీ ఆసియా ఆపర్చునిస్టిక్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్ లిమిటెడ్ ఒక్కొక్కటి రూ. 937.5 కోట్ల విలువైన షేర్లను అమ్ముతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తుంది.