జేఎస్​డబ్ల్యూ స్టీల్ లాభం .. రూ. 2,428 కోట్లు

జేఎస్​డబ్ల్యూ స్టీల్ లాభం  ..  రూ. 2,428 కోట్లు

న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్​కు ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో  రూ. 2,428 కోట్ల నికర లాభం వచ్చింది. 2022–-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 839  కోట్ల నికర లాభాన్ని ఆర్జించామని  జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  మొత్తం ఆదాయం రూ.38,275 కోట్ల నుంచి రూ.42,544 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.36,977 కోట్ల నుంచి రూ.39,030 కోట్లకు ఎగిశాయి. కంపెనీ తన బోర్డు సమావేశాన్ని జపాన్‌లోని టోక్యోలో నిర్వహించింది. జపాన్‌కు చెందిన జేఎఫ్​ఈ స్టీల్ కంపెనీలో వాటాదారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో స్వయం సౌరభ్‌ను చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపింది. ఈ  క్వార్టర్​లో కంపెనీ ముడి ఉక్కు ఉత్పత్తి 6.43 మిలియన్ టన్నులకు చేరింది.  స్టీల్ అమ్మకాలు 5.71 మిలియన్ టన్నులు ఉన్నాయి.