ఆస్ట్రేలియా బ్లాక్‌‌ వాటర్‌‌‌‌ కోల్‌‌ మైన్‌‌లో వాటాలు కొననున్న జేఎస్‌‌డబ్ల్యూ?

ఆస్ట్రేలియా బ్లాక్‌‌ వాటర్‌‌‌‌ కోల్‌‌ మైన్‌‌లో వాటాలు కొననున్న జేఎస్‌‌డబ్ల్యూ?


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని  బ్లాక్‌‌వాటర్ కోల్ మైన్‌‌లో (సెంట్రల్ క్వీన్స్‌‌లాండ్‌‌లోని)  20 శాతం వాటా  దక్కించుకోవాలని జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్ ప్రయత్నిస్తోంది. వైట్‌‌ హెవెన్ కోల్ నుంచి ఈ వాటాను బిలియన్ డాలర్లకు (రూ.8,300 కోట్లకు) కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఫైనల్ వాల్యుయేషన్‌‌పై ఇంకా  నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 

ఇరు కంపెనీలు అంగీకరిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ డీల్ పూర్తవుతుందని అన్నారు. తాజాగా కెనడాకు చెందిన టెక్ రిసోర్సెస్‌‌  కోల్ బిజినెస్‌‌లో వాటాలను కొనేందుకు బిడ్ వేయడంలో జేఎస్‌‌డబ్ల్యూ గ్రూప్ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత ఈ న్యూస్ బయటకొచ్చింది.