
హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. కొన్ని రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొన్నాళ్ల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. కిడ్నీ ఫెయిల్యూర్ అని పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం మరింత అనారోగ్యానికి గురవ్వటంతో.. కుటుంబ సభ్యులు గచ్చిబౌలి AIG ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
2025, ఫిబ్రవరి 20వ తేదీ నాటికి.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అతని కుటుంబ సభ్యులు, ఆస్పత్రి డాక్టర్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.