జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడిలో ఆలయ వార్షికోత్సవాలు

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడిలో ఆలయ వార్షికోత్సవాలు

ఫొటోగ్రాఫర్, వెలుగు: జూబ్లీహిల్స్​పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. ప్రత్యేక పూజల్లో భాగంగా మంగళవారం ఉదయం చండీ హోమం, దిక్వాలక భైరవ బలిహరణం, పూర్ణాహుతి, కలశోద్వాసన నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి రథోత్సవం అనంతరం నిర్వహించిన క్రాకర్స్ షో హైలెట్ గా నిలిచింది. నింగిలోకి దూసుకెళ్లిన తారా జువ్వల వెలుగులో ఆ ప్రాంతం మొత్తం ప్రకాశవంతంగా మారింది. క్రాకర్స్​షోను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

సూర్య, చంద్రులపై ఊరేగిన శ్రీవారు

గ్రేటర్​ఆలయాల్లో రథ సప్తమి వేడుకలు కనుల పండువగా సాగాయి. జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్ టీటీడీ టెంపుల్స్​లో నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్​లో ఉదయం సూర్య వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగారు. హిమాయత్ నగర్ ఆలయంలోని రథోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 

వెలుగు, బషీర్​బాగ్/ఫొటోగ్రాఫర్స్