- రూ.1.5 కోట్లు తీసుకొని బిజినెస్ పార్ట్నర్కు టోకరా
- బ్రాండ్ అంబాసిడర్‌గా పరిణీతి చోప్రా.. లాభాలు ఇస్తానని చీటింగ్
- పార్ట్నర్ శ్రీజ ఫిర్యాదుతో అదుపులోకి.. రిమాండ్‌కు తరలింపు
జూబ్లీహిల్స్, వెలుగు: నమ్మించి మోసం చేసిన కేసులో తృతీయ జ్యువెల్లరీ అధినేతను జూబ్లీహిల్స్ పోలీసులు అస్ట్చేసి, రిమాండ్‌కు తరలించారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఫోర్జరీ సంతకాలతో పలువురి మోసం చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాంతిదత్ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కథనం ప్రకారం.. ఏపీలోని విశాఖ పట్టణానికి చెందిన తోనాంగి కాంతిదత్(25) వ్యాపారి. జూబ్లీహిల్స్‌రోడ్డు నంబర్ 2లో ఉంటున్నాడు.
2023లో జూబ్లీహిల్స్‌రోడ్డు నంబర్36లో ఏర్పాటు చేసిన తృతీయ ఫైన్జ్యువెల్లరీ లో పార్ట్నర్షిప్ఇస్తానంటూ 2023 లో విశాఖపట్నం పెదగంట్యాడకు చెందిన తిప్పల శ్రీజ (32)కు ఆఫర్ఇచ్చాడు. ఈమె అల్కాపురి టౌన్షిప్లో ఉంటున్నది. అన్నట్టుగానే ఆమెను సంస్థకు డైరెక్టర్‌ను చేశాడు. ఆగస్టులో కంపెనీని విస్తరిస్తానని శ్రీజకు చెప్పాడు. అందుకు డబ్బు కావాలని ఆమె దగ్గరి నుంచి రూ.2.50 కోట్లను పెట్టుబడిగా తీసుకున్నాడు. బ్రాండ్అంబాసిడర్గా ప్రముఖ బాలీవుడ్నటి పరిణీతి చోప్రాను నియమించుకుని, ప్రచారం చేయించుకున్నాడు. దీనికి గాను ఆమెకు రూ. కోటిన్నర ఇస్తానని చెప్పాడు. ఆమెకు డబ్బులు ఇవ్వకుండా తన కంపెనీలో డైరెక్టర్‌గా నియమించుకుని, లాభాలు ఇస్తానని ఆఫర్ఇచ్చాడు.
దీనికి ఆమె ఒప్పుకున్నది. ఈ విషయం తెలుసుకున్న శ్రీజ తనకు తెలియకుండా పరిణీతి చోప్రాను ఎలా డైరెక్టర్‌గా పెట్టుకుంటావని నిలదీసింది. తాను ఇచ్చిన డబ్బులు ఏం చేశావని ప్రశ్నించింది. దీంతో శ్రీజ సంతకాలు ఫోర్జరీ చేసి, ఆమె డైరెక్టర్ పదవికి రిజైన్ చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్కార్పొరేట్అఫైర్స్కు లెటర్పంపించాడు. ఆ స్థానంలో తన తల్లి శ్రీదేవిని డైరెక్టర్‌ను చేశాడు. దీంతో తనను మోసం చేశాడని తెలుసుకున్న శ్రీజ..కాంతిదత్‌ను కలిసి మాట్లాడింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 26న జూబ్లీహిల్స్‌పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరో బాధితుడు అజయ్‌గౌతమ్ కూడా ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు కాంతిదత్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కాంతిదత్బారిన పడి మరో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా మోసపోయినట్టు సమాచారం. నయోమి హోటల్లో భాగస్వామ్యం కల్పిస్తానంటూ మాదాల శ్రీనివాస్ అనే వ్యక్తితో పాటు ప్రాంచైజీలు ఇస్తానని మరి కొందరిని కాంతిదత్ చీటింగ్చేసినట్టు తెలిసింది. నకిలీ పత్రాలతో స్టేట్‌బ్యాంక్ నుంచి రూ.3.87 కోట్లు రుణం తీసుకున్నట్టు సమాచారం. నిందితుడిపై మాదాపూర్పీఎస్లో హిట్అండ్రన్కేసు, సీసీఎస్‌లో మరో కేసు ఉన్నట్టు తెలుస్తున్నది.