మైనర్ బాలిక కేసులో సంచలన వాస్తవాలు..!

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో  సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి గత శనివారం ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 1న బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీసెక్షన్ 354, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో రాజకీయ ప్రముఖుడి కుమారుడు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు ఐదుగురు నిందితులను మైనర్లుగా గుర్తించారు. 

మే 28న 17ఏళ్ల బాలిక జూబ్లీహిల్స్ లోని పబ్ లో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో పబ్ నుంచి బయటకు వచ్చిన తనను కొందరు  గుర్తుతెలియని యువకులు బలవంతంగా కారులో తీసుకెళ్లారని, అదే రోజు రాత్రి ఏడు గంటల సమయంలో పబ్ వద్ద వదిలివెళ్లారని పోలీసులకు చెప్పింది. కారులో తనపై వారంతా అత్యాచారానికి పాల్పడ్డారని, మెడ పైన గాయాలయ్యాయని బాలిక తెలిపింది.  తనపై అత్యాచారం జరిగిన్నట్టుగా తండ్రికి చెప్పానని బాలిక పేర్కొంది. 
 

ఇదిలా ఉంటే మైనర్ బాలిక రేప్ కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా.. వాళ్లేవరు అనేదానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. బహదూర్ పురా ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా దానిపై కూడా ఏం మాట్లడటంలేదు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి మరొకరి కోసం వెదుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మైనర్ బాలికను బెంజ్ లో ఎవరు తీసుకెళ్లారు ? ఆ టైంలో కారులో ఎవరెవరు ఉన్నారు ? చివరగా ఆమెను ఇన్నోవాలో డ్రాప్ చేసిందెవరు అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈనెల 28న బాలిక తండ్రి ఫిర్యాదు చేస్తే.. పోలీసులు 31న FIR చెయ్యడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును కొంతమంది లీడర్లు ఇన్ ఫ్లూయన్స్ చేస్తున్నట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. 

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక పబ్ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలికను తీసుకెళ్లిన కార్ ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఆమ్నేషియా పబ్ దగ్గర బాలికను కారులో తీసుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారు నహీం ఫాతిమా ఖతూన్ అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. పార్టీ చేసుకోవడానికి పబ్ కి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. సాయంత్రం 5గంటలకు తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని చెబుతోంది. రాత్రి 7గంటలకు తనను మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారంది. కారులో తనను అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు వివరించింది. తనపై యువకులు దాడి చేసి గాయపరిచారని కంప్లైంట్ లో పేర్కొంది.

 

మరిన్ని వార్తల కోసం .. 

కర్నాటక బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా