వనపర్తి జిల్లా జడ్జిలతో రివ్యూ మీటింగ్

 వనపర్తి జిల్లా జడ్జిలతో రివ్యూ మీటింగ్

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులతో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్​ పోలియో జడ్జి జస్టిస్  అనిల్ కుమార్  జూకంటి శనివారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్  కేసులు, డిస్పోజబుల్​ కేసులు, న్యాయవాదుల, కక్షిదారులు, కోర్టుల్లో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్​ నిర్మాణానికి 20 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, కోర్టు ఏర్పాటుకు తనవంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు. 

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్​ సునీత, డీఎల్ఎస్ఏ సెక్రటరీ రజిని, సబ్​ జడ్జి కవిత, ప్రిన్సిపల్​ సీనియర్​ సివిల్​ జడ్జి రవికుమార్, ఫస్ట్​ అడిషనల్​ జూనియర్​ సివిల్​ జడ్జి శ్రీలత, సెకండ్​ అడిషనల్​ జూనియర్​ సివిల్​ జడ్జి జానకి, బార్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ మోహన్​కుమార్​ యాదవ్, జనరల్​ సెక్రటరీ బాలనాగయ్య పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన జస్టిస్​ అనిల్​కుమార్​కు కలెక్టర్​ ఆదర్శ్​ సురభి, అడిషనల్​ కలెక్టర్లు సంచిత్​ గంగ్వార్, వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రమణ్యం బొకేలు అందించి స్వాగతం పలికారు.