
మెదక్ టౌన్, వెలుగు: బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పునిచ్చారు. బుధవారం జిల్లా ఎస్పీ రోహిణి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోమటిపల్లి తండకు చెందిన బానోత్ రమేశ్ 12 నవంబర్2022నఓ బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. ఇంతలో స్థానికులు గమనించి సదరు వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు రమేశ్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. బుధవారం జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి ఈ కేసులో బానోత్ రమేశ్అలియాస్ సురేష్‌కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.40 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్పీ రోహిణి వెల్లడించారు.