గద్వాల టౌన్, వెలుగు: చైల్డ్ లేబర్ ను పనిలో పెట్టుకోవడం నేరమని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి గంట కవితా దేవి అన్నారు. మంగళవారం పాన్ ఇండియా బాల కార్మిక రెస్క్యూ లో భాగంగా జడ్జి తో పాటు బాల రక్ష భవన్ సిబ్బంది, కార్మిక శాఖ ఆఫీసర్లు సంయుక్తంగా గద్వాల జిల్లా లో పత్తి జిన్నింగ్ మిల్లు నందు చైల్డ్ లేబర్ కోసం తనిఖీ చేశారు. .
ఈ తనిఖీలలో ఏడు మంది చైల్డ్ లేబర్ ను గుర్తించి వారికి బాల కార్మిక నియంత్రణ చట్టం పై అవగాహన కల్పించి వారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరు పరిచారు. బాలల సంక్షేమ కమిటీ వారు పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి సఖి సెంటర్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో బాల రక్ష భవన్ సిబ్బంది పద్మ, లక్ష్మి, డిప్యూటీ లీగల్ ఐడీ డిఫెన్ కౌన్సిల్స్ శ్రీనివాసులు,రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.