కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేసిన జ్యుడీషియల్ కమిషన్

కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేసింది జ్యుడిషియల్ కమిషన్. రెండ్రోజుల క్రితం మేడిగడ్డను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ PC ఘోష్ సందర్శించారు. ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైంది కమిషన్. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన వారిని మరోసారి విచారించే అవకాశం ఉంది. 

ఇటు రిటైర్డ్ ఇంజనీర్ మురళీధర్ రావును విచారణకు పిలిచే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు పీసీ ఘోష్. మరోవైపు NDSA నివేదిక ఆధారంగా మరమ్మతు పనులు కంటిన్యూ అవుతున్నాయి.