- అడ్వకేట్ జనరల్ సూచనలతో ఏర్పాటు
- ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు
- ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలో జిల్లాల్లో పర్యటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సింగిల్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిషన్ నిమామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను పరి గణనలోకి తీసుకోవాలని కమిటీ నిర్ణయిచింది. మం గళవారం సెక్రటేరియెట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ 4వ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సబ్ కమి టీ మెంబర్లు, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సిం హ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమా రి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, లా సెక్రటరీ తిరుపతి పాల్గొన్నారు. బీసీ సామాజిక, ఆర్థిక కులగణన, ఓటర్ల గణనను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సబ్ కమిటీ తీర్మానించింది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై అధ్యయనం చేసిన ఎస్సీ అధికారుల బృందం ఇచ్చిన రిపోర్ట్‌పై మీటింగ్‌లో చర్చ జరిగింది. వన్‌మెన్ కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమల్లోకి తీసుకొస్తే, లీగల్ ఇష్యూస్ ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.
2011 జనాభా లెక్కల ప్రాతిపదికన వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలి పారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యోగ నియామకాలతో సహా నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకుగాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాలవారీగా పర్యటించ నున్నట్టు ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. యుద్ధప్రాతిపదికన బీసీ గణన చేపట్టాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రా వెంకటేశం, పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేశ్ కుమార్, మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, ఎస్సీ డెవలప్ మెంట్ కమిషనర్ టీకే శ్రీదేవి పాల్గొన్నారు.