
Tax Notice to Juice Vendor: వాస్తవానికి యూపీలోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో చిన్న జ్యూస్ షాప్ యజమాని రఈజ్ అహ్మద్. రోజుకు వ్యాపారం ద్వారా దాదాపు రూ.500 వరకు సంపాదించే ఈ వ్యాపారికి ఆదాయపు పన్ను అధికారుల నుంచి ఏకంగా రూ.7 కోట్ల 79 లక్షలకు టాక్స్ నోటీసులు వచ్చాయి. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం గడుపుతున్న తనకు అంత ఆదాయం వచ్చిందంటూ అధికారులు పన్ను నోటీసులు పంపటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అయితే అసలు విషయం నోటీసులు పంపిన తర్వాత దర్యాప్తులో బయటకు వచ్చింది. వాస్తవానికి సదరు జ్యూస్ షాప్ యజమాని పాన్ కార్డుపై ఏర్పాటు చేసిన ఖాన్ ట్రేడర్స్ పేరుతో నకిలీ సంస్థ ఏర్పాటు చేసి ఈ వ్యవహారం నడిచినట్లు అధికారులు గుర్తించారు. జూలై-డిసెంబర్ 2020 వరకు ఈ నకిలీ సంస్థ పేరుమీద దాదాపు రూ.7.79 కోట్ల విలువైన టర్నోవర్ సృష్టించినట్లు తేలింది. వాస్తవానికి పంజాబ్ లోని ఫతేఘర్ వద్ద భారీగా పట్టుబడ్డు సొమ్ముకు ఈ సంస్థతో లింకు ఉన్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
వాస్తవానికి ఖాన్ ట్రేడర్స్ పేరుతో రఈస్ పాన్ కార్డు మీద 2020లో జీఎస్టీ లైసెన్స్ కూడా తీసుకోబడింది. అయితే రూ.8 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత సంస్థ క్లోజ్ చేయబడింది. కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రఈస్ ఇంటికి మార్చి 22, 2025న పన్ను అధికారులు నోటీసులు పంపటం జరిగింది. పంజాబ్ ఎన్నిక కమిషన్ కూడా దీనిపై దర్యాప్తును కొనసాగిస్తోంది.
Also Read : పన్ను చెల్లింపుదారులకు కీలక అప్‌డేట్
వాస్తవానికి నిందితులు పంజాబ్ ఎన్నికల్లో డబ్బును తరలించటానికి ఈ నకిలీ ఖాతాను సృష్టించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఒక కారులో గుర్తించిన డబ్బు గురించి ఆదాయపు పన్ను అధికారులకు వచ్చిన సమాచారం గురించి లోతుగా పరిశీలించగా నకిలీ కంపెనీ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం పన్ను శాఖ తన నిబంధనల ప్రకారం రికవరీ ప్రక్రియను కొనసాగిస్తోంది. గడచిన మూడేళ్ల కాలంలో ఇలాంటి 90కి పైగా బోగస్ కంపెనీలను అధికారులు ఇతర వ్యక్తుల పేరుపై ఓపెన్ చేయబడినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో దీపక్ శర్మ అనే కలీక సూత్రదానికి పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వ్యక్తులకు సంబంధించిన పాన్, ఇతర పత్రాలను ఉపయోగించి నకిలీ ఖాతాలను తెరిచే ఈ వ్యక్తి సదరు వివరాలు ఇచ్చిన వారికి రూ.15 వేల వరకు ఇస్తుంటాడని తేలింది. ఇలాంటి మోసగాళ్ల వలలో పడటం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పన్ను అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఐదేళ్ల కిందట కచోరీ అమ్ముకునే వ్యక్తికి సైతం పన్ను అధికారులు ఇలాంటి నోటీసులు పంపించటం గమనార్హం.