
- ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై హర్షం
పిట్లం, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, షెడ్యూల్ కులాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం హర్షనీయమని జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో రిజర్వేషన్ల అమలు చేయడానికి కార్యాచరణ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మాదిగ, మాదిగ ఉప కులాల తరపున సీఎంను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రం, ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ముందుకు రాకపోయినా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి కార్యాచరణ ప్రకటించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మాదిగ ప్రజాప్రతినిధులు ఉన్నారు.