- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
పిట్లం, వెలుగు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు అన్నారు. మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ఆఫీసులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సీఎంఆర్ఎఫ్ ఉపయోగకరంగా ఉందని అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం బిచ్కుందలో అప్గ్రేడ్ చేస్తున్న ఐటీఐ కాలేజీని సందర్శించారు. కాలేజీ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.