నిజాంసాగర్’ను సందర్శించిన ఎమ్మెల్యే సతీమణి

నిజాంసాగర్’ను సందర్శించిన ఎమ్మెల్యే  సతీమణి

నిజాంసాగర్,(ఎల్లారెడ్డి )వెలుగు : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి తోట అర్చన ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గేట్ల కింది భాగంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుందని, సందర్శకులు అక్కడికి వెళ్లకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. ఆమెవెంట నిజాంసాగర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లికార్జున్, మాజీ జడ్పటీసీటీ చీకోటి జయ ప్రదీప్, నాయకులు, అధికారులు ఉన్నారు.