నల్గొండ ఏఎంసీ చైర్మన్ గా జూకూరి రమేశ్

నల్గొండ అర్బన్/తిప్పర్తి, వెలుగు : నల్గొండ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తిప్పర్తి మండలానికి చెందిన జూకూరి రమేశ్‌ను నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు వైస్ చైర్మన్ గా జూలకంటి వెంకట్ రెడ్డి,  డైరెక్టర్లుగా వజ్జ సత్యనారాయణ, ఎల్లా రవీందర్ రెడ్డి, మల్లెబోయిన ఆంజనేయులు, తంగేళ్ల యాదగిరిరెడ్డి, గంటేకంపు సైదులు, వాడల జానయ్య, నల్లబోతు సైదిరెడ్డి, పులకరం సుజాత, షేక్ కరీముల్లా, మెగావత్ శీనుతో పాటు తిప్పర్తి పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, మున్సిపల్ చైర్మన్ లను సభ్యులుగా నియమించింది.  వీరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.