- డబ్బుల సంచుల కేసు విచారణ దగ్గర్లోనే ఉంది
- బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అర్వింద్
కోరుట్ల రూరల్/మల్లాపూర్/జగిత్యాల రూరల్ : రేవంత్ రెడ్డి డబ్బు సంచులు మోసిన కేసు విచారణ దగ్గర్లోనే ఉందని, జులై 14 ఆయనకు డెడ్‌లైన్ అని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో, మల్లాపూర్, సారంగాపూర్ మండలాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొని మాట్లాడారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జులై 14 ఎప్పుడు వస్తుందా, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తాడా అని ఎదురుచూస్తున్నారన్నారు.
రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకం కాదని, ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది బీజేపీ అని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తారన్న భయంతో బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి గుడ్లు మోసుడు ఏందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పంచిరి విజయ్,మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడీ శ్రీనివాస్,లవంగ శివ,బీజేపీ నాయకులు గుగ్గిళ్ల తుక్కారం, ద్యావనపెల్లి శరత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.