Muharram Holiday: తెలంగాణలో మొహరం సెలవు ఎప్పుడో తెలుసా

Muharram Holiday: తెలంగాణలో మొహరం సెలవు ఎప్పుడో తెలుసా

మొహర్రం సెలవులను తెలంగాణ ప్రభుత్వం 9,10 తేదీలను ప్రకటించింది. షియా ముస్లింలు అషురా అని కూడా పిలుస్తారు. షియా ముస్లింలకు సంతాప దినంగా ఆషూరా అని కూడా పిలువబడే మొహర్రం 9 మరియు 10 తేదీలను తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నెలవంక ఆధారం మొహరంను ముస్లింలు జరుపుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ముహర్రం జూలై 7, 2024 నుండి ప్రారంభమవుతుంది. అషురా జరుపుకునే తేదీ జూలై 17...జులై 6న నెలవంక కనిపించినట్లయితే, ముహర్రం 9వ తేదీ ....  అషురా జులై 15... 16 తేదీలలో జరుపుకుంటారు. లేకుంటే జులై 16, 17 తేదీల్లో పాటిస్తారు.

ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. ఈ మాసంలో షియా ముస్లింలు సంతాపం తెలుపుతారు.మొహర్రం... అంటే, అషురా, షియా ముస్లింలకు సంతాప దినం, ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ అతని బంధువులతో కలిసి అమరుడయిన రోజని ముస్లిం మత పెద్దలు చెబుతుంటారు. ఈ రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

 ఇస్లాం మతం ప్రజలకు మొహర్రం రోజు చాలా ప్రత్యేకమైనది. దీనిని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, మొహర్రం ఇస్లాం యొక్క మొదటి నెల.  మొహర్రం జరుపుకునే తేదీని చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు జరుపుకుంటారు. అందువలన ప్రతి సవంత్సరం ఈ పండుగ తేది మారుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 12 నెలలు ఉన్నాయని, వాటిలో 4 అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. వీటిలో 1. ఖదా 2.  హిజ్జా,3. మొహర్రం 4. రజబ్. ముస్లిం మతాచారాల ప్రకారం అల్లాను ప్రార్థించేందుకు .. ఇస్లామిక్​ దేవుడి ఆశీస్సులు పొందడానికి ఈ నెలలు చాలా ముఖ్యమైనవని ముస్లిం మత పెద్దలు చెబుతుంటారు.ఇస్లామిక్ ఆచారాల ప్రకారం మొహర్రం సమయంలో దానధర్మాలు చేయాలని బెబుతుంటారు.అలా చేస్తే  అల్లా ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయి. 

మొహర్రం యొక్క ప్రాముఖ్యత

మొహర్రంను  ముస్లింలు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు, మరోవైపు దీనిని సంతాప దినంగా కూడా పరిగణిస్తారు. మొహర్రం నెలలో  10వ రోజుని యౌమ్-ఎ-అషురా అని పిలుస్తాము. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం, హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఈ రోజున అమరుడయ్యాడు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఇస్లాం మత స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. అతను హజ్రత్ ముహమ్మద్ సాహిబ్ యొక్క చిన్న మనవడు... హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం మొహర్రం 10వ రోజును సంతాపంగా జరుపుకుంటారు.  దీనిని అషూరా అని పిలుస్తారు. కొంతమంది ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం రోజున ఊరేగింపు కూడా చేస్తారు. దీనినే పీర్ల పండుగ అని కూడా అంటారు.

ఉపవాసం ఎప్పుడు పాటిస్తారు

షియా ముస్లింలు.. సున్నీ  ముస్లింలు   మొహర్రం గురించి వివిధ నమ్మకాలను కలిగి ఉన్నాయి. వారు ఈ పండుగను ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల అల్లా సంతోషిస్తాడని, ఆయన ఆశీస్సులు ఉంటాయని చెబుతారు. ఈ సమయంలో, సున్నీ ముస్లింలు మొహర్రంనెలలో 9 , 10 రోజులలో ఉపవాసం ఉంటారు.  అయితే షియా ముస్లింలు  మొహర్రం నెలలో 1వ రోజు  9 వరోజు మధ్య ఉపవాసం ఉంటారు.