శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా ఇప్పటికే బిజీ అవగా.. చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. హీరో ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌కి జంటగా ఆమె ఓ చిత్రంలో నటించబోతోంది. మంగళవారం ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ, రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని ఫాంటమ్ స్టూడియోస్, ఏజిఎస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
మోడ్రన్ రొమాన్స్, సోషల్ మీడియా, హ్యూమన్ రిలేషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ‘మహారాజ’ తర్వాత జునైద్ నటిస్తున్న రెండో చిత్రమిది. మరోవైపు ఖుషీ తొలిచిత్రం ‘ది ఆర్చీస్’ కూడా నెట్ ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అయింది.
కరణ్ జోహార్ బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్న ఆమెకు ఇది మూడో చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్‌కు ఇదే ఫస్ట్ థియేట్రికల్ మూవీ కావడం విశేషం.
Are you ready to experience love in the digital era with #KhushiKapoor and #JunaidKhan ?
— Archana Kalpathi (@archanakalpathi) September 17, 2024
In Cinemas worldwide on 7th Feb 2025!
Directed by #advaitchandan. @fuhsephantom @Ags_production @ZeeStudios_ @shrishtiarya @archanakalpathi pic.twitter.com/rIBk1VoPxp