ఏడేళ్లకే ఐటీ కంపెనీ..13 ఏళ్లకే బీటెక్ స్టూడెంట్స్‌కు క్లాసులు

  • బైజుస్ యంగ్ జీనియస్‌గా.. జునైరా ఖాన్

హైదరాబాద్: పిల్లలు తల్లిదండ్రులను.. చుట్టూ పరిసరాలను గమనిస్తూ పెరుగుతారు. మంచి విషయాల పట్ల వారిలో ఆసక్తి పెరిగేలా చేస్తే..  ఆసక్తులను ఆచరణలో పెట్టేందుకు మార్గం చూపితే.. అద్భుతాలు సృష్టిస్తారు. కన్న తల్లిదండ్రులే కాదు ప్రోత్సహించిన వారితోపాటు..  అందరూ గర్వించే విజయాలు సాధిస్తారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. దీనికి తాజా నిదర్శనం హైదరాబాద్ కు చెందిన యంగ్ జీనియస్ జునైరా ఖాన్. నాలుగో తరగతి వయసులోనే కోడింగ్ మెళకువలు నేర్చుకుని ఏడేళ్ల వయసులోనే ఐటీ కంపెనీ పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు 2021లో 13 ఏళ్ల వయసుకు చేరిన జునైర్ ఖాన్ ఏకంగా బీటెక్ విద్యార్థులకు కోడింగ్ లో మెళకువలు నేర్పుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడంతోపాటు.. వారిలో స్ఫూర్తి రగిలించేందుకు కృషి చేస్తున్న బైజుస్ సంస్థ జునైరా ఖాన్ ను ‘‘యంగ్ జీనియస్’’ గా ఎంపిక చేసింది. యంగ్ జీనియస్ నాల్గవ ఎపిసోడ్ కు ఆమెను ఎంపిక చేసినట్లు బైజుస్ ప్రకటించింది చదువుకుంటూనే.. ఒక వైపు ఐటీ కంపెనీ ద్వారా తన క్లయింట్లకు సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ సేవలు అందిస్తూ.. తన కంటే ఎన్నోరెట్లు పై చదువులు చదువుతున్న వారికి సులువుగా అర్థమయ్యేలా కిటుకులు చెబుతోంది. 13 ఏళ్ల బాలిక ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్తుంటే.. తల్లిదండ్రుల కోసం వచ్చిందేమో అనుకునేవారు.. బాలిక క్లాసులు చెబుతుందని తెలిస్తే.. ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన జునైరా ఖాన్ చిన్ననాటి నుండే మంచి విషయాల పై ఆసక్తి కలిగే తల్లిదండ్రులు ప్రోత్సహించేవారు. తల్లి నిషాత్ ఖాన్,వృత్తిరీత్యా ఐటి ట్రైనర్,బి-టెక్ విద్యార్థులకు నేర్పించేవారు. జునైరా తన తల్లి ల్యాప్ టాప్ లో పనిచేస్తూ.. దానితోనే బీటెక్ విద్యార్థులకు క్లాసులు చెబుతుంటే ఆసక్తిగా గమనించిన జునైరాను తనకు కూడా నేర్పమని మారాం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. నాలుగో తరగతి చదువుతున్న జునైరాకు కోడింగ్ ఎలా నేర్పాలో అర్థం కాలేదు. ఆమెకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అలా చెబుతుంటే.. ఇలా నేర్చేసుకుంటుండడంతో.. తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. ఇంకా బాగా  ప్రాక్టికల్ గా అర్థమయ్యేందుకు సొంత వెబ్ సైట్ ను ప్రారంభించి దాని పనులు అప్పగించారు. సొంత వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం నేర్చుకున్నాక కొన్ని క్లయింట్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడం నేర్పారు. అలా ఔపసన పట్టేయడంతో ఆమెకు మరింత బాధ్యతలు అప్పగించడానికి ఏడేళ్ల వయసులోనే ఐటీ కంపెనీ పెట్టించారు. అలా చిన్న వయసులోనే ఐటీ కంపెనీ నిర్వాహకురాలిగా నిలిచిన జునైరా ఖాన్ ఇప్పుడు బి-టెక్ విద్యార్థులకు మెళకువలు బోధిస్తోంది. తన పేరుతోనే ‘‘జెడ్ ఎం ఇన్ఫోకామ్ ’’ అనే సొంత వెబ్ సైట్ తో దూసుకెళ్తున్న జునైరా  ఇప్పటికే ఐదు బ్యాచుల బీటెక్ విద్యార్థులకు మెళకువలు నేర్పింది. నేర్చుకునేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థులు కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతోందని సంతోషపడుతుండడంతో జునైరా క్లాసుల కోసం క్యూ కట్టడం ప్రారంభించారు. దీంతో ఆరో బ్యాచ్ ను కూడా జునైరా ప్రారంభించింది.  రెండేళ్ల క్రితమే టీమ్ మేనేజ్ మెంట్ కోసం సొంత అప్లికేషన్ సృష్టించిన సక్సెస్ తో.. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ లపై పనిచేస్తూ.. పలు మొబైల్ బిజినెస్ యాప్‌లను రూపొందించింది.

for more news..

నిన్నటి వరకు వాలంటీర్.. ఇప్పుడు సర్పంచ్

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్