జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: స్వర్ణ పతకాల రేసులో 21 మంది బాక్సర్లు

జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: స్వర్ణ పతకాల రేసులో 21 మంది బాక్సర్లు

అమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జోర్డాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–17లో మరో ఏడుగురు బాక్సర్లు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. ఇందులో ఆరుగురు విమెన్ బాక్సర్లు ఉన్నారు. దీంతో అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–17, 15 కేటగిరీలో మొత్తం 21 మంది బాక్సర్లు బంగారు పతకాల వేటలో ఉన్నారు. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–17 విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అహనా శర్మ (50 కేజీ).. అక్మరల్ అమంటైవా (కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. 

ఖుషి చాంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (44–46 కేజీ) 3–2తో ఒలెక్సాండ్రా చెరెవాటా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలవగా, జన్నత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (54 కేజీ), సిమ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (60 కేజీ), హర్సికా (63 కేజీ), అన్షిక (80+ కేజీ) తమ ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలు సాధించి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–17లో దేవాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (80 కేజీ) 4–1తో ఎనుగుయెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోంగ్ టియెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వియత్నాం)ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించాడు.