- వీఆర్ఏ రెగ్యులరైజేషన్ ద్వారా పోస్టింగ్ పొందిన సతీశ్
- 2 నెలలుగా అందని జీతం
హనుమకొండ, ఆత్మకూరు, వెలుగు : వీఆర్ఏ రెగ్యులరైజేషన్‌లో భాగంగా జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ పొందిన ఓ యువకుడు జీతం రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తోటి ఉద్యోగులు, గ్రామస్తుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఇజ్జగిరి సతీశ్ (36) వీఆర్ఏగా పని చేసేవాడు. రెండు నెలల కింద ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. సతీశ్‌కు దామెర తహసీల్దార్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చింది.
అప్పటి నుంచి జీతం రాకపోవడంతో సతీశ్ ఇబ్బందులు పడుతున్నాడు. కుటుంబపోషణ భారమై, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా ఇదే విషయమై బుధవారం రాత్రి తల్లిదండ్రులు, భార్యతో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన సతీశ్ అర్ధరాత్రి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రాజేందర్ తెలిపారు.