
దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన వారు పర్సనల్ ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్, ఇంటర్‌ప్రిటేషన్ (60 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ (60 ప్రశ్నలు, 60 మార్కులు) అంశాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి 17న రాతపరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ట్రైనింగ్, ఫీజు: ఎంపికైన అభ్యర్థులను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో చేరుస్తారు. ఆ సమయంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత గల అభ్యర్థులకు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది.