![పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు](https://static.v6velugu.com/uploads/2024/11/junior-civil-judge-orders-extension-of-remand-of-patnam-narender-reddy_DJhMqIl3ds.jpg)
కొడంగల్, వెలుగు: లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రిమాండ్ ను డిసెంబర్ 11 వరకు పొడిగిస్తూ కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 11న ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ కోసం రైతుల అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చెయ్యగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారంతో 14 రోజుల రిమాండ్ ముగియడంతో కొడంగల్ మేజిస్ట్రేట్ మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. ఏ1 నరేందర్ రెడ్డి, ఏ2 సురేశ్ పిటిషన్లను కొడంగల్ కోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది.