జూనియర్ డాక్టర్​పై కొలీగ్ అత్యాచారం.. మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ ఘటన

జూనియర్ డాక్టర్​పై కొలీగ్ అత్యాచారం.. మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ ఘటన

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌‌లో ఓ జూనియర్​డాక్టర్​పై తన కొలిగ్​అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్వాలియర్ సిటీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గల పాడుబడిన హాస్టల్‌‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 25 ఏండ్ల జూనియర్ డాక్టర్‌‌ గజరాజా మెడికల్ కాలేజీలోని బాలికల హాస్టల్‌‌లో ఉంటోంది.

ఆమెతో కలిసి చదువుకున్న జూనియర్ డాక్టర్ తనతో మాట్లాడాలని, పాత బాయ్స్​ హాస్టల్‌‌ కు రావాలని పిలిచాడు. ఆమె పాడుబడిన హాస్టల్​లోకి చేరుకోగానే నిందితుడు ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం బాధితురాలు అక్కడి కంపు పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని వారు తెలిపారు.