మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికోవర్ హాస్పిటల్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కూతురును డాక్టర్లే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

 ఇప్పటివరకు ట్రీట్ మెంట్ కు 3 లక్షల రూపాయలు కట్టామని చెబుతున్నారు కుటుంబీకులు. అర్ధరాత్రి మరో 4 లక్షలు కట్టాలని లేదంటే వైద్యం ఆపేస్తామంటూ బెదిరించారని చెప్పారు. ఉదయాన్నే లక్ష రూపాయలు కట్టిన తరువాత పేషంట్ చనిపోయిందని, మిగతా 3 లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామంటున్నారని చెబుతున్నారు కుటుంబసభ్యులు. వైద్యం ఆపేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని ఆరోపిస్తున్నారు.