పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు రెండోరోజు మంగళవారం సమ్మెను కొనసాగించారు. డ్యూటీలను బహిష్కరించి, హాస్పిటల్మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. డిమాండ్లను పరిష్కరించాంటూ నినాదాలు చేశారు.
ఎలక్టివ్సర్జరీలు, ఓపీ సేవలు, వార్డు డ్యూటీలను బహిష్కరించినట్లు గాంధీ జూడా యూనిట్ ప్రెసిడెంట్ డా.ఎం.వంశీకృష్ణ తెలిపారు. డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఐసీయూ, ఎమర్జెన్సీ సర్వీసుల్లో మాత్రం జూనియర్డాక్టర్లు పాల్గొన్నారు.