మెడికోల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలి.. గాంధీ ఆస్పత్రిలో జుడాలనిరసన

హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడికోల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అని డిమాండ్ చేస్తూ గాంధీ లో జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. కలకత్తాలో మెడికల్ విద్యార్థి మీద జరిగిన దాడికి కారణం అయిన నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఘటనపై సీబీఐ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. 

మెడికల్ కాలేజ్ లో రెసిడెంట్ డాక్టర్లకు, జూనియర్ డాక్టర్లకు కనీస వసతులు లేవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  పోలీస్ సిబ్బందితో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ వార్డు లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని..మెడికోలకు  ప్రత్యేక రక్షణ చట్టం ఉన్నపటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వాపోయారు.

ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా వైద్య సేవలను నిలిపి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వాలు స్పందించే వరకు తమ నిరసన కార్యక్రమాలు ఉంటాయని జూనియర్ డాక్టర్లు తెలిపారు.