
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివినవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
విభాగాలు: జూనియర్ ఇంజినీర్‌గా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, కేంద్ర జల, విద్యుత్ రీసెర్చ్ స్టేషన్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్, పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పని చేయవచ్చు.
అర్హతలు: డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు. వయసు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1 ఆన్‌లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పేపర్-2 ఆఫ్‌లైన్‌లో జరిగే(డిస్క్రిప్టివ్) రాత పరీక్ష. పేపర్-1లో మొత్తం 200 మార్కులకు.. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్-2లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్ పరీక్ష. పేపర్-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 26 నుంచి అప్లై చేసుకోవాలి. వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.