సెంట్రల్లో 968 జూనియర్ ఇంజినీర్ పోస్టులు

సెంట్రల్లో 968 జూనియర్ ఇంజినీర్ పోస్టులు

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్​మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 968 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆబ్జెక్టివ్ అండ్ డిస్ర్కిప్టివ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన ఈ జాబ్​లో ప్రారంభంలోనే నెలకు 50 వేలకు పైగా వేతనాలు అందుతుండటంతో తీవ్ర పోటీ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18వ తేదీలోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ ఇంజినీర్ పోస్టులు గ్రూప్- బి నాన్ గెజిటెడ్ పోస్టులు. సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, ఫరక్కా బ్యారేజ్ సర్వీస్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్, డెరెక్టరేట్ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వంటి ప్రభుత్వ ఇంజినీరింగ్‍ విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు.

ఎగ్జామ్ ప్యాటర్న్ :  ఆబ్జెక్టివ్ (పేపర్–I), డిస్ర్కిప్టివ్ టెస్ట్ (–II) ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆన్‍లైన్‍లో జరిగే పేపర్–I లో మూడు సబ్జెక్టుల నుంచి రెండు వందల మార్కులకు 200 ప్రశ్నలు వస్తాయి. మొదటి రెండు సబ్జెక్టులు అందరికీ కామన్ కాగా మూడో సబ్జెక్టు సంబంధిత బ్రాంచ్ (సివిల్, మెకానికల్, ఎలక్ర్టికల్) నుంచి ఉంటుంది. నెగెటివ్‍ మార్కింగ్‍ ఉంది. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్కు మైనస్‍ అవుతుంది. వివిధ షిప్టుల్లో పరీక్ష  నిర్వహిస్తారు కాబట్టి మెరిట్‍లో నార్మలైజేషన్‍ విధానాన్ని అనుసరిస్తారు. కనీస అర్హత  మార్కులున్నాయి. ఓసీలు30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్లు 25%, ఇతరులు 20 శాతం మార్కులు పొందాలి. పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగం (100 ప్రశ్నలు- 300 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

సిలబస్‍ & ప్రిపరేషన్‍ టిప్స్

జనరల్‍ ఇంటెలిజెన్స్ అండ్‍ రీజనింగ్‍ :  ఈ విభాగంలో వర్బల్‍, నాన్‍వర్బల్‍ రీజనింగ్‍ నుంచి ప్రశ్నలు వస్తాయి. అనాలజీస్‍ (నంబర్, ఫిగర్), సిమిలారిటీస్‍ అండ్‍ డిఫరెన్సెస్‍,  స్పేస్‍ విజువలైజేషన్‍, ప్రాబ్లం సాల్వింగ్‍, అనాలసిస్‍, జడ్జిమెంట్‍, డెసిషన్‍ మేకింగ్‍, విజువల్‍ మెమొరీ, అర్థమెటిక్‍ రీజనింగ్‍, డైరెక్షన్స్, కోడింగ్-డీకోడింగ్, రక్త సంబంధాలు, అరేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ టెస్ట్, ర్యాంకింగ్‍ టెస్ట్, దిక్కులు-దూరాలు, వెన్‍ డయాగ్రమ్స్, పజిల్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనికి ఆర్‍ఎస్‍ అగర్వాల్‍ రీజనింగ్‍ పుస్తకంతో పాటు ఎస్సెస్సీ ఇతర పరీక్షల ప్రీవియస్‍ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్‍ ప్యాటర్న్ తెలుస్తుంది. ఈ విభాగంలో ప్రాక్టీస్‍ తో నే మంచి మార్కులు సాధ్యమవుతాయి. 

జనరల్‍ అవేర్‍నెస్‍ :  జనరల్‍ అవేర్‍నెస్‍ విభాగం చాలా విస్తృతమైనది. కరెంట్‍ అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్‍ నాలెడ్జ్ లో దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి జియోగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో బ్రిటిషు పాలన, స్వాతంత్ర్య పోరాటం, బ్రిటిషు గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర్య సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్‍ పాలిటీలో వర్తమాన రాజకీయ అంశాలతో ముడిపెట్టి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు ప్రభుత్వంలో తాజా నియామకాలు, రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైన్స్ అండ్‍ టెక్నాలజీ ల నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నిత్యజీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు, శరీరధర్మ శాస్ర్తం, వ్యాధులు, వైరస్‍లు, మొక్కలు - ఉపయోగపడే భాగాలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పదోతరగతి స్థాయిలోనే  ప్రశ్నలుంటాయి కాబట్టి వీటికి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ 8, 9, 10 పదోతరగతి పుస్తకాలను చదవాలి. 

జనరల్ ఇంజినీరింగ్ :  సివిల్, ఎలక్ర్టికల్, మెకానికల్ వంటి ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో ప్రశ్నల స్థాయి డిప్లొమా లెవెల్లో ఉంటుంది. ఇందులో మూడు పార్టులుంటాయి. పార్ట్–ఎలో సివిల్ ఇంజినీరింగ్, పార్ట్–బిలో ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్, పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సి లో మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలిస్తారు. జేఈ పరీక్షలో ప్రీవియస్ పేపర్లలో వచ్చిన మోడల్స్, ప్రశ్నలు దాదాపు రిపీట్ అవుతుంటాయి. కాబట్టి సొల్యూషన్స్ కలిగిన ప్రీవియస్ పేపర్లను విశ్లేషించుకుంటూ చదివితే ప్రిపరేషన్ సులువవుతుంది. 

సివిల్ ఇంజినీరింగ్ :  బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ వాల్యుయేషన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్ ఇంజినీరింగ్, ట్రాన్స్​పోర్టేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ వంటి టాపిక్​ల నుంచి ప్రశ్నలొస్తాయి. క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులకు దీనికి అదనంగా థియరీ ఆఫ్ స్ర్టక్చర్స్, కాంక్రీట్ టెక్నాలజీ, ఆర్సీసీ డిజైన్, స్టీల్ డిజైన్ వంటి స్ర్టక్చరల్ ఇంజినీరింగ్ టాపిక్​ల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 

ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ :  బేసిక్ కాన్సెప్ట్స్, సర్క్యూట్ లా, మ్యాగ్నటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ర్టుమెంట్స్, ఎలక్ర్టికల్ మెషిన్స్, ఫ్రాక్షనల్ కిలోవాట్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, సిక్రోనస్ మెషిన్స్, జనరేషన్, ట్రాన్స్​మిషన్ అండ్ డిస్ర్టిబ్యూషన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, యుటిలైజేషన్ అండ్ ఎలక్ర్టికల్ ఎనర్జీ, బేసిక్ ఎలక్ర్టానిక్స్ వంటి టాపిక్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 

మెకానికల్ ఇంజినీరింగ్ :  ఈ సబ్జెక్టులో థియరీ ఆఫ్ మెషిన్స్ అండ్ మెషిన్స్ డిజైన్, ఇంజినీరింగ్ మెకానిక్స్ అండ్ స్ర్టెంత్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టాన్సెస్, ఫస్ట్ లా ఆఫ్ థర్మో డైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మో డైనమిక్స్, ఎయిర్ స్టాండార్డ్ సైకిల్స్ ఫర్ ఐసీ ఇంజిన్స్, ఐసీ ఇంజిన్స్ పర్ఫార్మెన్స్, ఐసీ ఇంజిన్ కంబస్టన్, ఐసీ ఇంజిన్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్, రాంకిన్ సైకిల్ ఆఫ్ సిస్టమ్, బాయిలర్స్, క్లాసిఫికేషన్, స్పెసిఫికేషన్, ఫిట్టింగ్ అండ్ యాక్సెసరీస్, ఎయిర్ కంప్రెసర్స్ అండ్ దెయిర్ సైకిల్స్, రిఫ్రిజరేషన్ సైకిల్స్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్ ప్లాంట్, నాజిల్స్ అండ్ స్టీమ్ టర్బైన్స్ వంటి చాప్టర్లు చదువుకోవాలి. డిస్ర్కిప్టివ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా సంబంధిత సబ్జెక్టు నుంచే ప్రశ్నలిస్తారు. వీటికి ఎస్సే టైప్ ఆన్సర్స్ రాయాలి.

నోటిఫికేషన్ 

ఖాళీలు :  మొత్తం 968 పోస్టుల్లో జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438, జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37, బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి 
మంత్రిత్వ శాఖ :  2, సెంట్రల్ వాటర్ కమిషన్: 12, సెంట్రల్ వాటర్ కమిషన్: 120, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్: 121, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్: 217, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్): 2, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ 

స్టేషన్: 3, డీజీక్యూఏ- నావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 3,  డీజీక్యూఏ- నావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 3, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 2, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 2, నేషనల్ 
టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్: 6 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 

అర్హతలు :  డిప్లొమా (సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చదివినవారు అర్హులు.  సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి.  సెవెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- నుంచి రూ.1,12,400 జీతం చెల్లిస్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్​లో ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించారు. 

సెలెక్షన్ ప్రాసెస్  :  పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1, పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 రాత పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు :  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I) జూన్ 4 నుంచి జూన్ 6 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్​సైట్​లో 
సంప్రదించాలి.

టెస్ట్ ప్యాటర్న్

పేపర్    సబ్జెక్టు    ప్రశ్నలు    మార్కులు 
I    జనరల్‍ ఇంటెలిజెన్స్ అండ్‍ రీజనింగ్‍    50    50
    జనరల్‍ అవేర్‍నెస్‍    50    50
    జనరల్ ఇంజినీరింగ్(సబ్జెక్టు)    100    100
II    డిస్ర్కిప్టివ్ టెస్ట్ (సబ్జెక్టు)    -    300
    మొత్తం    200    500
* సమయం: 2 గంటలు