ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ అథారిటీలో జూనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్​

ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ అథారిటీలో జూనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్​

ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఏఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 490 జూనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. విద్యార్హతలు, గేట్‌‌‌‌ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

అర్హతలు: అన్ని పోస్టులకూ గేట్‌‌‌‌-2024 స్కోరు ఉండాలి.  బీటెక్‌‌‌‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌‌‌‌) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఏఏఐలో ఏడాది ప్రొబేషన్‌‌‌‌ పూర్తిచేసినవారికి పదేళ్ల సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా అప్లికేషన్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌కు షార్ట్‌‌‌‌లిస్టును తయారుచేస్తారు. గేట్‌‌‌‌ స్కోర్‌‌‌‌కు మొదటి ప్రాధాన్యమిస్తారు. ఎంపికైనవారికి ఆరు నెలల శిక్షణ ఉంటుంది. వీరిని  దేశవ్యాప్తంగా ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనుభవం అవసరం లేదు.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో మే 1 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు రూ.300 చెల్లించాలి. వివరాలకు  www.aai.aero వెబ్​సైట్​లో సంప్రదించాలి.