జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఇచ్చి 600 రోజులైనా..ఫలితాలు విడుదల చేయలేదు

జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఇచ్చి 600 రోజులైనా..ఫలితాలు విడుదల చేయలేదు

హైదరాబాద్: జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ విడుదల చేసి 600 రోజులు గడుస్తుందని ఇంకా ఫలితాలను విడుదల చేయలేదని జూనియర్ లెక్చరర్స అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు అభ్యర్థులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులు వేణు, లక్ష్మీ మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని.. అందులో తమను భాగస్వామ్యం చేయాలని కోరారు.

2022 లో టీజీపీఎస్సి 1392  జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని.. 2023 లో ఎగ్జామ్ నిర్వహించారని చెప్పారు. ... 2024 ఆగస్టు లో సర్టిఫికెట్ వెరైఫికేషన్ పూర్తయినట్లు వివరించారు. ఇప్పటి వరకు ఫలితాలను విడుదల చేయలేదన్నారు. అక్టోబర్ 9న డిఎస్సి ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్ల ఫలితాలను విడుదల చేయాలని కోరారు అభ్యర్థులు.