ప్రిన్సిపల్, స్టాఫ్ ​వేధింపులతో చెరువులో దూకి జూనియర్ ​లెక్చరర్ ​సూసైడ్

ప్రిన్సిపల్, స్టాఫ్ ​వేధింపులతో చెరువులో దూకి జూనియర్ ​లెక్చరర్ ​సూసైడ్
  • ప్రిన్సిపల్, స్టాఫ్ ​వేధింపులతో చెరువులో దూకి జూనియర్ ​లెక్చరర్ ​సూసైడ్
  • ఫోన్​లో వాయిస్ రికార్డ్ 
  • మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘటన 
  • మృతురాలు కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లి వాసి..

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​లోని సోషల్​ వెల్ఫేర్​రెసిడెన్షియల్​ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్న తిరుమలేశ్వరి(39) పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి నాలుగేండ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తోంది. 

రోజూలాగానే భర్త సంపత్ సోమవారం ఉదయం 6 గంటలకు ఆమెను కాలేజీలో దించి వెళ్లాడు. తిరిగి 8 గంటలకు ఫోన్ చేయగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి..సెల్​ఫోన్, బ్యాగ్ పట్టణంలోని చెరువు వద్ద కనిపించిందని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తిరుమలేశ్వరి నీటిలో తేలుతూ కనిపించింది. పోలీసుల సహాయంతో ఆమెను బయటకు తీసి చెన్నూర్ గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఆమెకు 12 ఏండ్ల కూతురు ఉంది.

వేధింపులతోనే.. 

ఆత్మహత్యకు ముందు తిరుమలేశ్వరి ఫోన్​లో వాయిస్​రికార్డు చేసింది. ప్రిన్సిపాల్ రాజమణి, సిబ్బంది స్రవంతి, రేష్మ, శిరీష, పుష్పలత వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొంది. వాయిస్​రికార్డు ఆధారంగా మృతురాలి అన్న కుమారస్వామి, భర్త సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్​తెలిపారు.